కన్నుల పండువగా దినభందు కాలనీ లో శివశక్తి యూత్ ఆధ్వర్యంలో గణనాధుని శోభాయాత్ర…
జనంసాక్షిజోగిపేట:తొమ్మిది రోజులపాటు భక్తుల నుంచి విశేష పూజలు అందుకున్న గణనాధుడిని శనివారం వైభవంగా నిమజ్జనానికి తరలించారు. పరిధిలోని దినభందు కాలనీ శివశక్తి యూత్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో కొలువుదీరిన గణపయ్యకు నవరాత్రులు ఉత్సవాలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు జై బోలో గణేష్ మహరాజ్ కి జై అంటూ భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం కన్నుల పండువగ సాగింది.తొమ్మిది రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి పయనమయ్యాడు.బ్యాండ్ మేళాలు,భక్తి గేయాలు,మహిళల కోలాటాలు, పిల్లల కేరింతల నడుమ యువత చిందులేస్తూ ముందుకు సా




