రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు

హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమవదించారు. కృష్ణంరాజు గారి అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం తరువాత జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.