భక్తిశ్రద్ధలతో బతుకమ్మ వేడుకలు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 25(జనం సాక్షి)
ప్రతి ఏటా మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించే బతుకమ్మ పండుగ సంబరాలు ఆదివారం వరంగల్ నగరంలోని కరీమాబాదులో వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా మహిళలు  గునుగు  గుమ్మడి, తంగేడు, బంతి, చామంతి పూలతో పేర్చిన బతుకమ్మలను చేత బోని స్థానిక బొమ్మల గుడి వద్ద పెట్టి బతుకమ్మ పాటలతో ఆడి పాడారు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క మహిళ బతుకమ్మ మాకు బంగారం లాంటి బతుకు ఇవ్వమని వేడుకుంటూ పాడుకున్నారు 9 రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఎంతో ఉత్సాహంగా వేడుకలను నిర్వహించారు.