Friday, 6 November 2026

భగత్ సింగ్ జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అధికారికంగా నిర్వహించాలి

గుండాల,సెప్టెంబర్23(జనంసాక్షి): భగత్ సింగ్ జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అధికారంగా నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర పిలుపులో భాగంగా గుండాల తాసిల్దార్ నాగదివ్య కి వినతి పత్రం ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి షాహిద్ అందజేశారు. ఈ సందర్భంగా షాహిద్ మాట్లాడుతూ మాతృభూమి విముక్తి కోసం దేశ ప్రజల స్వేచ్ఛ కోసం బ్రిటిష్ పరిపాలనపై తిరుగుబాటు చేసిన భగత్ సింగ్ జయంతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని భారతమాత సంకెల విముక్తి కోసం భగత్ సింగ్ చేసిన వీరోచిత పోరాటాలు పాఠ్యాంశాల్లో చేర్చాలని అదేవిధంగా భగత్ సింగ్ కు భారతరత్న అవార్డు ప్రకటించాలని, భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు .ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ మండల కార్యదర్శి ఉడుగుల శ్యామ్, రవి వర్మ, పవన్ కళ్యాణ్, సతీష్ ,వరుణ్, సొరబ్ ,సంపత్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు