పేదల కోసం పనిచేసే ప్రభుత్వం

   *రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాపరెడ్డి తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 23:: కెసిఆర్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి పనిచేసే ప్రభుత్వం అని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాపరెడ్డి పేర్కొన్నారు తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఇంటింటికి తాగునీరు గ్రామానికి డంపింగ్ యార్డ్ స్మశాన వాటిక ప్రకృతి వనం గ్రామ నర్సరీలు ఏర్పాటు చేశామని త్వరలోనే ప్రతి గ్రామంలో క్రీడాస్థలం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు గ్రామీణ స్థాయి నుండి క్రీడలను ప్రోత్సహిస్తే రాష్ట్ర జాతీయ క్రీడాకారులుగా ఎదుగుతారని లక్ష్యంతో ముఖ్యమంత్రి క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుకు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డి సప్న వెంకటేష్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
Attachments area