హైదరాబాద్ : తాను భయపడేవాడిని కాదని, బెదిరిస్తే పారిపోనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెరాస నేతల వ్యాఖ్యలపై సీఎం తీవ్రంగా స్పందించారు.కాలర్ పట్టుకొని మెడికల్ కాలేజీ ఇప్పించామని హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపైనే తన అభ్యంతరమని అన్నారు హరీశ్‌రావు బాధపడి ఉంటే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని చెప్పారు.మెదక్ జిల్లాలో ట్రాక్టర్లు తయారీ యూనిట్ ప్రారంభించింది. కాంగ్రెస్సేనని తెలిపారు. విమానాల విడిభాగాల తయరీ పరిశ్రమను కూడా తెలంగాణలోనే పెట్టామని చెప్పారు. తాగునీటితో ఇబ్బందిపడుతున్న చిత్తూరుకు నీళ్లిస్తే విమర్శిస్తారా అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో కార్ల పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పందం చేసుకోనున్నామని వెల్లడించారు. ఉద్యమం వల్ల తెలంగాణ విద్యార్తులకు చదువు, ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారని విమర్శించారు.




