జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ బుధవారం రోజు భారత్ జోడొ యాత్రను జయప్రదం చేయాలి అని కాంగ్రెస్ నాయకులకు రాష్ట్ర తెలంగాణ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ పిలుపునిచ్చారు. జోగిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులతో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం రాష్ట్రం ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరిస్తు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని వెండకట్టాలని ఏసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భరత్ జోడొ యాత్రను విజయవంతం చేయాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆయా జెడ్పిటిసిలు, ఎంపీటీసీలు పాల్గొని జోడొ యాత్ర ఏ విధంగా నిర్వహించాలని ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చిట్టిబాబు,రంగ సురేష్, జడ్పిటిసి,ఎంపిటిసిలు,సర్పంచులు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.




