భర్తను హతమార్చిన భార్య !

భూపాలపల్లి ప్రతినిధి అక్టోబర్ 10 జనం సాక్షి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి కూరపాటి రామ తన భర్త  కూరపాటి రాములు ను రోకలి బండతో కొట్టి  పలిగిన  సీసాలతో పొడిచి చంపినట్లు గ్రామస్తులు తెలిపారు. కుటుంబ కలహాల తోనే భర్త రాములును ప్లాన్ ప్రకారం చంపి వేయడం జరిగిందని గ్రామస్తులు తెలియజేశారు. అక్రమ సంబంధం నేపంతోనే భర్తను చంపినట్లుగా, గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందజేయగా మొగుళ్ళపల్లి ఎస్సై శ్రీధర్, చిట్యాల సిఐ పులి వెంకట్  గౌడ్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్లు వారు తెలిపారు. శవ పంచానామా జరిపి పోస్టుమార్టం నిమిత్తము పరకాల సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై శ్రీధర్, సిఐ వెంకట్ గౌడ్ లు వివరించారు. కుటుంబ కలహాల మూలంగా రోజువారి గొడవలు జరిగేవని, అక్రమ సంబంధానికి అడ్డు  ఉన్న భర్త రాములు మద్యానికి అలవాటు పడి రోజువారి గొడవల మూలంగా కుటుంబ కలహాలు ఏర్పడడంతో తన భర్త అడ్డును తొలగించాలనే ఉద్దేశంతో ఆదివారం రాత్రి రోకలిబండతో కొట్టి చంపినట్లు ఎస్సై శ్రీధర్, సిఐ వెంకట్ గౌడ్ లకు గ్రామస్తులు తెలియజేయడం జరిగిందన్నారు. హత్య కేసు పై దర్యాప్తు జరుపుతున్నట్లు వారు తెలిపారు.