భాజపా దళిత మోర్చా అధ్యక్షులుగా నీరటి రవి
ఇబ్రహీంపట్నం , సెప్టెంబర్ 13 ,(జనం సాక్షి ) భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బట్టు జకరయ్య ఆద్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భాజపా మండల దళిత మోర్చా అధ్యక్షులుగా ఎర్ధండి గ్రామానికి చెందిన నీరటి రవిని ఏకగ్రీవంగా ఎన్నుకొని , నియామక పత్రాలను అందించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు తీగల శ్రీధర్ రెడ్డి , జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ , జిల్లా కిషన్ మోర్చా కార్యవర్గ సభ్యులు బైన మహేష్ , ఇట్టేడి చిన్నయ్య ,జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి బండి గోపాల్,మండల ప్రధాన కార్యదర్శి సుంచు రనధీర్ ,ఉపాధ్యక్షులు వెంకటేష్ యాదవ్ ,ఎదపల్లి రాజారెడ్ది , కార్యదర్శిలు వెంకటస్వామి ,మారుతీ ,దగ్గుల అశోక్ , శ్రీనివాస్ , సతీష్ ,కిషన్ మోర్చా అధ్యక్షులు గడ్డం సంజీవ్ , యువ మోర్చా అధ్యక్షులు నవీన్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి మహేందర్ , సోమా శిరీస్ ,
ఓబీసీ మోర్చా అధ్యక్షులు మాలేపు శ్రీనివాస్ , నాయకులు పుప్పాలా మహేష్ ,ఏళ్ళ శ్రీనివాస్ , భాశెట్టి రాజేందర్ , నవీన్ , సామ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.