హైదరాబాద్ రవీంద్రభారతిలో భారత తెలంగాణ ప్రభుత్వం – భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో పినాకిని యూత్ వెల్ఫర్ అసోసియేషన్ మరియు SRR చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారతరత్న మదర్ థెరిసా జయంతి సందర్భంగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రంలోని మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి చాలా మంది సేవా దృక్పథం తోటి పనిచేసే సమాజ సేవ చేసిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి దాదాపుగా 25 మందిని ఒకే వేదిక మీద సన్మానం చేయించడం శుభదాయకం అని అన్నారు.
ఒక సంకల్పం తోటి ఎవరైతే సమాజంలో సేవ అంకితం అయితరో వాళ్ళందర్నీ ఒక వేదికపైకి తీసుకొచ్చే సన్మానం చేయడం మంచి ఆలోచన అని అన్నారు.
తెలంగాణలోని కవులు, కళాకారులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అనేక రకాలైన ప్రోత్సాహకాలు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త గారు, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ, పినాకిని యూత్ అధ్యక్షులు మురళీమోహన్ రాజు, SRR చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రామచంద్రరావు,కె రవికాంత్, శ్రీనివాస్, రఘునాథరావు, పెద్దపల్లి కౌన్సిలర్ పెద్ది గీతాంజలి, సత్యనారాయణ, శ్రీనివాసరావు, విజయ్ కుమార్, డా,, డి ముత్తు, బత్తిని నర్సింహులు గౌడ్, ఫౌండేషన్, ట్రస్ట్ సభ్యులు, అవార్డ్ గ్రహీతలు, తదితరులు పాల్గొన్నారు





