*భారతీయ జనతా యువ మోర్చా మెట్పల్లి పట్టణ శాఖ అధ్వర్యంలో బైక్ ర్యాలీ*
మెట్పల్లి టౌన్ ,సెప్టెంబర్ 14
(జనం సాక్షి)
బిజెవైఎం మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా బిజెవైయం మెట్ పల్లి పట్టణ అధ్యక్షులు ఆర్మూర్ రంజిత్ మాట్లాడుతూ నేడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వ పాలన కొనసాగిస్తుందన్నారు. ఉద్యమాలు చేసి,ప్రాణత్యాగాలు చేసి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే వున్నాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తానని 8 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ మజ్లిస్ పార్టీకి వత్తాసు పలుకుతూ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. బిజెపి తెలంగాణలో నిజాం విముక్త తెలంగాణ 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలను నిర్వహించుటకు సెప్టెంబరు 17న సంసిద్ధమవుతున్నది తెలిపారు. అమృత మహోత్సవాలలో భాగంగా రజాకార్ల అకృత్యాలకు సజీవ సాక్ష్యాలను నేటి తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి బిజెవైయం పట్టణ అధ్యక్షుడు ఆర్మూర్ రంజిత్, జిల్లా అధికార ప్రతినిధి బోడ్ల నరేష్, ప్రధాన కార్యదర్శి కలికోట శ్రీకాంత్ పట్టణ ఉపాధ్యక్షులు కుడుకల రఘు, పసునూరి ఆనంద్, బోడ్ల గౌతమ్, రాజ్ కిరణ్, పట్టణ కార్యదర్శి యమా వినోద్, అసెంబ్లీ ఐటీ సెల్ జాయింట్ కన్వీనర్ శంభోజి వివేక్, టౌన్ కన్వీనర్ ద్యాగేల నవీన్, జక్కని నందు, బిజెవైయం నాయకులు పర్రె రాజ్ కుమార్, పడిగేల రాజు,భాను, శ్రీను,విపుల్, సాయి,రవి, తదితరులు పాల్గొన్నారు