భారత్ జోడో యాత్రను విజయవంతం చేద్దాం

యూత్ కాంగ్రెస్ జుక్కల్ నియోజక వర్గ అద్యక్షులు ఇమ్రోజ్
జుక్కల్, అక్టోబర్ 20, (జనంసాక్షి),
ఈనెల 23నుండి నవంబర్ 7వతేది వరకు తెలంగాణా లో జరిగే భారత్ జోడో యాత్రను విజయవంతం చేద్దామని యూత్ కాంగ్రెస్ జుక్కల్ నియోజక వర్గం అద్యక్షులు ఇమ్రోజ్ అన్నారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశ ఐక్యత కోసం దేశంలోని నియంత పాలకులను గద్దె దించడం కోసం రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రలో అందరం పాల్గొందామని అన్నారు. ప్రజాస్వామ్యవాదులు, నిరుద్యోగులు,సబ్బండవర్గాలు ఈ యాత్రను విజయ వంతo చేద్ధామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి,కామారెడ్డి యూత్ ప్రెసిడెంట్ సందీప్,బాన్సువాడ యూత్ ప్రెసిడెంట్ మధుసూధన్ రెడ్డి, అశోక్,నగేష్,మునీర్,నేహాల్,మోహమ్మద్, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.