యువతి ఆత్మహత్య కారణమైన నిందితుల అరెస్టు

జనం సాక్షి కథలాపూర్
కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన యువతి వస్మిత ఆత్మహత్య చేసుకోగా దానికి కారణమైన నిందితులను గురువారం అరెస్టు చేసినట్లు సిఐ రాజశేఖర్ రాజ్ , ఎస్సై రామచంద్రమ్ గౌడ్ తెలిపారు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రుద్రంగి గ్రామానికి చెందిన బైరి జలంధర్, అందుకు ప్రోత్సహించిన వేములవాడకు చెందిన బైరి రాజమును అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రేమ పేరుతో ఆడపిల్లలను ఆకర్షించి వారిని వేధింపులకు గురిచేసే కఠినమైన చర్యలు ఉంటాయని తెలిపారు. వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ల ద్వారా ఆడపిల్లను ఆకర్షించి వేధిస్తే పోలీసులను ఆశ్రయించాలని కోరారు.