భారత్ జోడో యాత్రలో కొండపాక విజయ్ కుమార్

కొండపాక (జనంసాక్షి) అక్టోబర్ 07 : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా గజ్వేల్ నియోజకవర్గంలో టీపీసీసీ రాష్ట్ర డెలికేట్ మెంబర్ మాదాడి జస్వయంత్ రెడ్డి నాయకత్వంలో యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర మనోహరాబాద్ మండల్ కాళ్ళకల్ గ్రామం నుంచి కొండపాక మండలంలో ముగియనుందని జస్వయంత్ రెడ్డి తెలిపారు. గాంధీ విగ్రహనికి పువ్వుల మాల వేసి కార్యక్రమంన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మతం పేరు, కులం పేరుమీద, ప్రాంతం పేరుమీద ప్రజలు విడగొట్టి ఈ దేశాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నారని అన్నారు. దాన్ని పసిగట్టి అందరం ఒక్కటిగా ఉండాలని సూచించారు. రాహూల్ గాంధీ తీసుకున్న ఈ నిర్ణయం దేశంలో పెను మార్పులకు కారణమౌతుందని, తప్పకుండా ఈ దేశ ప్రజలు ఈ ప్రభుత్వాలకు బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మామిడ్యాల శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ విభాగం కన్వీనర్ విజయ్ కుమార్, బాల కృష్ణరెడ్డి, కృష్ణ రెడ్డి, వై.నాగరాజు యాదవ్, జీ. రాజు ముదిరాజ్, వై.మల్లేష్ యాదవ్, మండల నాయకులు, సీ.హెచ్ నాగరాజు యాదవ్, జీ.రఘు, వీ.అనీల్, కె.మహేష్, నర్సన్ పల్లి నాగరాజు,విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.