Monday, 2 November 2026

భారీగా గుట్కాల ప్యాకెట్లు స్వాధీనం

మిర్యాలగూడ,సెప్టెంబర్‌1 జ‌నంసాక్షి: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని అశోక్‌ నగర్‌ లో నిషేధిత గుట్కాలను అక్రమంగా తయారు చేస్తున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. డీఎస్పీ రాంగోపాల్‌ రావ్‌ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. లక్షల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లు, గుట్కా తయారీ మిషన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా తయారు చేస్తున్న వ్యక్తులను అరెస్ట్‌ చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు.