ఏసీబీ వలలో జూనియర్ అసిస్టెంట్
విశాఖపట్నం,సెప్టెంబర్1(జనంసాక్షి): రాష్ట్రంలో మరో అవినీతి జలగ ఏసీబీకి చిక్కింది. వడ్డాది మాడుగుల తహసీల్దార్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న జగన్నాథం రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి రెడ్‌హ్యాండెడ్‌గా జూనియర్ అసిస్టెంట్ జగన్నాథంను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.