భారీ లాభాలతోస్టాక్ మార్కెట్
భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి స్టాక్ మార్కెట్లు. 234 పాయింట్లు జంప్‌చేసి 31,595ను తాకింది సెన్సెక్స్. 9732 దగ్గర నిఫ్టీ రికార్డ్ స్థాయిని నమోదు చేసిన అనంతరం స్వల్పంగా వెనుకంజ వేసింది. అయితే మార్కెట్ ప్రారంభంలో NSE రేట్లు అప్టేడ్ కావడంలో తలెత్తిన సాంకేతిక సమస్య కొంత గందరగోళం నెలకొంది. తర్వాత సమస్య పరిష్కారం కావడంతో మార్కెట్ కొనసాగింది. సెన్సెక్స్ 195 లాభంతో 31556 వద్ద నిఫ్టీ 22 పాయింట్లు ఎగిసి 9687వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్నిరంగాలూ లాభాల్లోనే కదులుతున్నాయి. బ్యాంకింగ్ నిఫ్టీ, మెటల్, ఆటో సెక్టార్లు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి.