భారీ వర్షం వల్ల మండల కేంద్రం రాకపోకలు నిలిచిపోయాయి
జనంసాక్షి – రాజంపేట్
మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సోమవారం సాయంత్రం మంగళవారం ఉదయం వరకు కురిసినటువంటి భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పోయాయి కామారెడ్డి నుండి రాజంపేట్, కొండాపూర్, గుండారం ,మెదక్ ఎల్లారెడ్డి ,ప్రాంతాలకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులు అక్కడే చిక్కుకొని అవస్థ పడుతున్నారు. వాగులు పొంగి పోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది .రాజంపేట్ మండల కేంద్రానికి రావాల్సిన వారు అక్కడే చిక్కుకుంటున్నారు. కామారెడ్డి నుండి రాజంపేట్ కు వచ్చే దారి మధ్యలో మొండి వాగు లో రెండు బైకులు కొట్టుకపోయాయి వాహనదారులకు ఎలాంటి అపాయం జరగలేదు. అలాగే రాజంపేట్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో జలదిగ్బంధం లో చిక్కుకున్నాయి. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు రాజంపేట్ మండలంలోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు