Wednesday, 4 November 2026

భారీ వర్షాల కారణంగా ఈద్గా,ఖిలా ఈద్గా లో బక్రీద్ నమాజు రద్దు

సెంట్రల్ ముస్లిం కమిటీ తీర్మానం

జగిత్యాల జిల్లా..

సెంట్రల్ ముస్లిం కమిటీ సమావేశం శనివారం మధ్యాహ్నం నిర్వహించారు ,ఈ సమావేశంలో ముస్లిం కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ బారి అధ్యక్షతన వహించారు,
భారీ వర్షాల కారణంగా ఈద్ ఉల్ అజహ బక్రీద్ పండగ సందర్భంగా కమిటీ సభ్యులతో చర్చలు జరిపారు

ఈ సందర్భంగా ఈద్ ఉల్ అజహ నమాజు జమే మసీద్ లో ఉదయం 7.00 గంటలకు మత గురువు ముస్తాక్ అహ్మద్ ప్రత్యేక నమాజ్ నిర్వహిస్తారు, రెండవసారి 8 గంటలకు నమాజు నిర్వహించాలని నిర్ణయించారు,

భారీ వర్షాల కారణంగా జిల్లా కేంద్రంలోని ఆయా మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని సెంట్రల్ కమిటీ నిర్ణయించారు,

ఈ సమావేశంలో సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు భారీ, ప్రధాన కార్యదర్శి మంజూర్, ఈద్గా కమిటీ అధ్యక్షుడు జుల్ఫిహాఖర్, ఉపాధ్యక్షుడు జమీర్, ఖిల్లా ఈద్గా అధ్యక్షుడు యూనిస్ నదీమ్ ఉపాధ్యక్షుడు జహీర్ఉద్దీన్ కమిటీ ప్రధాన కార్యదర్శి సఫీ ఉద్దీన్, ఇర్ఫాన్ జాఫర్ రషీద్ ,సాజిద్ ,జిల్లా కేంద్రంలోని మసీద్ అధ్యక్షులు, సెంట్రల్ ముస్లిం కమిటీ సభ్యులు పాల్గొన్నారు