భారీ వర్షాలపై అధికారులతో సిఎం సవిూక్ష
సహాయక చర్యల్లో పాల్గొనాలని సిఎం కెసిఆర్ సూచన
హైదరాబాద్,ఆగస్ట్16(జనం సాక్షి): భారీవర్షాల కారణంగా శుక్రవారం జరగాల్సిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ, పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం సంయుక్త సమావేశం వాయిదా పడింది. వర్షాల కారణంగా ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున సమావేశం వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, వరద పరిస్థితి, ఇతర జిల్లాల్లో వర్షాల ప్రభావంపై సీఎం సవిూక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు రాబోయే ఒకటి రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లో సమాయక చర్యల్లో పాల్గొనాలని సిఎం కెసిరా/- సూచించారు. జిల్లాల్లోనే ఉండి వరదల వల్ల ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోనేలా చూడాలన్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు ఉధృతంగా కురుస్తున్నాయి. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్య ప్రజాప్రతినిధులంతా స్థానికంగా అందుబాటులో ఉండాలి కాబట్టి.., శుక్రవారం నాటి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. వర్షాలు తగ్గిన తర్వాత సమావేశం ఉంటుందని, త్వరలోనే తేదీ ఖరారు చేస్తామని సీఎం వెల్లడించారు.రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు, రాబోయే ఒకటీ రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, వరదల పరిస్థితిని, ఇతర జిల్లాల్లో వర్షాల ప్రభావాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సవిూక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, డీజీపీ మహేందర్ రెడ్డిలతో మాట్లాడారు. ఇప్పటికే నియమించిన స్పెషల్ ఆఫీసర్లు ఆయా జిల్లాల్లో వర్షం, వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, స్థానిక అధికారుల సమన్వయంతో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ జిల్లాల్లో నియోజకవర్గాల్లోనే ప్రజలకు అందుబాటులో ఉండి.. అధికారులు, పోలీసుల సహకారంతో అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సచివాలయంలో కూడా సీనియర్ అధికారి నాయకత్వంలో 24 గంటల పాటు వర్షాల పరిస్థితిని పర్యవేక్షించాలని చెప్పారు. ప్రజలకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని, వాగులు, వంకలు పొంగి రోడ్లపైకి వచ్చే అవకాశం ఉన్నచోట అప్రమత్తంగా ఉండాలని కోరారు.
———————




