బిజెపి కార్యాలయ శంకుస్థాపన రద్దు
అమరావతి,ఆగస్ట్16(జనం సాక్షి): కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా పడింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం వద్ద నిర్మించే భారతీయ జనతా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి గురువారం కేంద్ర మంత్రి భూమి పూజ చేయాల్సి ఉంది. పార్టీ కార్యాలయం నిర్మించే ప్రాంతంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అంతా చిత్తడిగా మారింది. దీంతో కార్యాలయంనిర్మించే ప్రాంతానికి చేరుకునే మార్గాలు సైతం బురదమయమంగా మారాయి. నేతలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా బుధవారం మళ్లీ వర్షం కురవడంతో అంతా చిత్తడిగా మారింది. బహిరంగ సభ నిర్వహించే ప్రాంతమూ బురదమయంగా మారడంతో భూమి పూజ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు పార్టీ నేతలు తెలిపారు. దీంతో మొత్తం కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు. తదుపరి ఎప్పుడనేది ప్రకటిస్తారు. దీనికితోడు మాజప్రధాని వాజ్‌పేయ్ ఆరోగ్యం విషమంగా ఉండడంతో మొత్తంగా కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
—–