బషీరాబాద్ జూలై 27, (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో గురువారం రోజున ఏకతాటిగా కురుస్తున్న భారీ వర్షాల వల్లన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని తహశీల్దార్ ఎన్.వెంకట్ స్వామి తెలిపారు.బషీరాబాద్ మండలంలో జీవంన్గీ వాగు, గంగారం కల్వాట్,టాకీ తండా కల్వాట్,మార్పల్లి కల్వాట్, జలల్ పూర్ కల్వాట్,నవల్గా చెరువు ఆల్గు,భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్నా వరద నీటిని పరిశీలించిన తహశీల్దార్ ఎన్.వెంకట్ స్వామి,ఎస్.ఐ పి. వేణు గోపాల్ గౌడ్,ఎంపీడీవో రమేష్,ఆర్.ఐ వెంకటేష్, విద్యుత్ లైన్మెన్ రాజు ప్రజలకు సూచనలు చేశారు.గ్రామాలలో చెట్ల కింద,శిధిలావస్థలో ఉన్న భవనాల కింద ఉండకూడదని, విద్యుత్ స్థంభాలు తాకరాదని చెప్పారు.అదేవిధంగా పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నామని తెలిపారు.
భారీ వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,అధికారులు అందుబాటులో ఉన్నారు-తహశీల్దార్ ఎన్.వెంకట్ స్వామి




