Thursday, 5 November 2026

భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దడంలో గురువులదే కీలక పాత్ర డా. సత్యం శ్రీరంగం

తనకు విద్య నేర్పిన గురువులకు రుణపడి ఉంటా

*గురువులందరికీ గురు పూజాదినోత్సవ శుభాకాంక్షలు

కూకట్ పల్లి(జనంసాక్షి ):భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దడంలో గురువులదే కీలక పాత్ర అని టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం పేర్కొన్నారు.సోమవారం సర్వేపల్లి రాధా క్రిష్ణన్ జయంతి సందర్బంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని భరత్ నగర్ కాలనీ అధ్యక్షులు నాగి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ సర్వే రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ గీతాచార్యుడు, ప్రబోధకుడు, యుగపురుషుడు, జ్ఞాన మహర్షి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అని కొనియాడారు.గురువులకే గురువు అందుకే ఆయన పుట్టిన రోజున ‘ఉపాధ్యాయ దినోత్సవం’ జరుపుకుంటున్నామన్నారు. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, గురువు ఎలా ఉండాలో ఆయన స్పష్టంగా చెప్పారన్నారు.తనకు విద్య నేర్పిన గురువులకు రుణపడి ఉంటాను అన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే ఉందని విద్యార్థుల్లోని ప్రతిభను ఉపాధ్యాయులే వెలికి తీస్తారన్నారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానం ఎంతో గొప్పదని, మనలో అజ్ఞాన పొరలు తొలగించి, జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువులని అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫతే నగర్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, మూసాపేట కార్పొరేటర్ మహేందర్ ఉపాధ్యాయులు ఈశ్వరయ్య, మాధవి, గీతా, సుజాత, రాజా రావు, యూనిస్, సుకృత్, శ్రీనివాస్, సంతోష్, బిక్షపతి, పవన్ రెడ్డి, జ్యోతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.