Tuesday, 3 November 2026

భిన్న సంస్కృతుల సమ్మేళనం తెలంగాణ జీవితం

హైదరాబాద్‌,జూన్‌2(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రజలది మూలవాసి సంస్కృతి. ఆది మానవుడు నడయాడిన దశ నుంచి, ఆధునిక నాగరికత వరకు తెలంగాణ ప్రజల మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాల్లో వైవిధ్యం, విభిన్నత చోటుచేసుకున్నది. నాగార్జున కొండ, ఏకశిలా నగరాల బౌద్ధ ఆరామాలను బట్టి, ఇక్కడ బౌద్ధమతాన్ని ప్రజలు పెద్ద మొత్తంలో ఆదరించారనే విషయం అర్థమవుతుంది. బౌద్ధుల తర్వాత, జైనమతం తెలంగాణలో అడుగుపెట్టింది. నల్లగొండ, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లో జైన మతానికి సంబంధించిన, అనేక ఆనవాళ్లు తవ్వకాల్లో బయటపడ్డాయి. భువనగిరి సవిూపంలోని కొలను పాక జైన మందిరాన్ని ప్రజలు విస్తృతంగా సందర్శిస్తుంటారు. బౌద్ధ, జైన మతాల తర్వాత, ఉత్తర భారతం నుంచి వచ్చినది ముస్లిం మతం. పాలకులుగా ముస్లింలు సుమారు నాలుగువందల ఏళ్ల పాటు పాలించడం వల్ల ఇక్కడి సంస్కృతిలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముస్లిం పాలనలోనే కైస్త్రవ, సిక్కు, పార్సీ తదితర మతాలు కూడా, తెలంగాణ నేలపైన అడుగుపెట్టాయి.ఇలా భిన్నమతాల సంగమంగా తెలంగాణ సంస్కృతి పేరుగాంచింది.తెలంగాణ అనగానే గుర్తొచ్చే బతుకమ్మ, బోనాలు మొదలైన పండుగలు తెలంగాణప్రత్యేకతను నిలబెడుతున్నాయి. ఈ పండుగలను మిగిలిన ఏ ప్రాంతంలోనూ జరుపుకోరు. అలాగే పువ్వులతో పండుగ చేసుకునే చరిత్ర ప్రపంచంలో మరెక్కడా కానరాదు.హిందూ ముస్లిం సోదరత్వానికి చిహ్నంగా దర్గా, ఉర్సు ఉత్సవాలు జరుపుకుంటారు. ఇందులో భాగంగా పీరీల పండుగను కూడా తెలంగాణలో ఘనంగా జరుపుకుంటారు. అలావ సుట్టూ అడుగులు వేస్తూ..పాటలు పాడుకుంటారు. దసరాతో పాటు ఉత్తర భారతీయుల వలసతో తెలంగాణకు వచ్చిన పండుగ ¬ళీ. ఇది తెలంగాణ గ్రావిూణ ప్రాంతాల నుంచి మొదలుకొని ముఖ్యపట్టణాల వరకు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. బతుకమ్మ, ¬ళీ పండుగలపై ప్రత్యేకంగా పాటలు కూడా రూపొందించుకున్నారు ఇక్కడి ప్రజలు.ఇక ఆహారం విషయానికోస్తే తెలంగాణ వంటకాలు కూడా మిగిలిన తెలుగు సమాజపు రుచులలో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. సకినాలు, బచ్చాలు, బిర్యానీ తదితర కమ్మటి రుచులు, తెలంగాణ ఆహారపు ప్రత్యేకతలను చాటుతాయి…ఇంతటి ఘనమైన సంస్కృతిమన తెలంగాణ ప్రజలది.