భీమదేవరపల్లి మండలం బీజేపీ పార్టీ ఆఫీస్ ప్రారంభం
భీమదేవరపల్లి మండలం ఆగస్టు (17) జనంసాక్షి న్యూస్
తెలంగాణ రాష్ట్రంలో తెరాస నాయకులు గుండాయిజం చేస్తున్నారని మీటింగ్లకు ఫ్లెక్సీలు కడితే తప్ప ఒక నీచమైన సంస్కృతిని తెరాస నాయకులు పెంచి పోషిస్తున్నారని బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. బుధవారం నాడు భీమదేవరపల్లి మండలం బిజెపి పార్టీ కార్యాలయాన్ని ముల్కనూరు ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెరాస పతనం ప్రారంభమైందని బండి సంజయ్ సంగ్రామ యాత్రకు ప్రజలు పడుతున్న మంగళ హారతులు అందుకు నిదర్శనం అన్నారు. బిజెపి నాయకులపై కక్షపూరితంగా కేసులు నమోదు చేసేలా పోలీసులను తొత్తులుగా ఉపయోగించుకుంటున్నారని ఆమె అన్నారు. పీకే చెప్పినట్టు కెసిఆర్ రాష్ట్రంలో డ్రామాలాడుతున్నాడని వాళ్లు ఒకటి కొడితే మేము పది కొట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తుందని భయంతోనే కేంద్ర రాష్ట్ర బిజెపి నాయకులు సభలు ఏర్పాటు చేస్తే ఫ్లెక్సీలు పెట్టడానికి కూడా స్థలం లేకుండా తెరాస నాయకులు స్థలాలను అనవసరం ప్రచారం పేరిట వృధా ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జ్ చాడ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకులు దొంగల కోమురయ్య ,సారయ్య దుర్గా సింగ్,మాచర్ల కుమార్ స్వామి, మండల అధ్యక్షులు పృధ్విరాజ్, నాయకులు ,కవిత బుర్ర శివసాగర్, సదానందం కిషన్ ,సాయి ,శ్యామ్ ,రణధీర్, కుమారస్వామి,తదితరులు పాల్గొన్నారు.