– పిఎసిఎస్ చైర్మన్ బాల్రాజ్ గౌడ్
బిజినేపల్లి .జనం సాక్షి .ఆగస్టు 19 : మరణం చెందిన బీమా చారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని పిఎసిఎస్ చైర్మన్ బాల్రాజ్ గౌడ్ అన్నారు మండలంలోని మంగనూరు గ్రామానికి చెందిన భీమా చారి 37 అనే ఆర్ఎంపి వైద్యుడు శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందాడు దీంతో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ని తక్షణ సాయంగా 10 వేల ఆర్థిక సహాయం అందజేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు భవిష్యత్తులో బాధిత కుటుంబానికి అండగా ఉండి మృతుని పిల్లలను చదివిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు గంగనమోని రాములు, రాజు, అనిల్ గౌడ్, రాగి రమేష్, లోకేశ్వర్ రెడ్డి, గంగనమోని మధు తదితరులు ఉన్నారు




