భీమా వర్తింపజేయాలని ఎమ్మెల్యేకు వినతి

వేములవాడ రూరల్, సెప్టెంబర్ 17 (జనం సాక్షి) : నాయి బ్రాహ్మణ కులస్తులకు ప్రమాద భీమాను వర్తింపజేసేలా చూడాలని శనివారం ఆరెపల్లి నాయి బ్రాహ్మణులు ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. జీవనోపాధి కోసం కులవృత్తిని నిర్వహిస్తున్నామని, ఎలాంటి భూములు లేనందున ప్రభుత్వం అందించే రైతు బీమా వర్తించదని వారు వాపోయారు. కులవృత్తిని చేసుకుంటున్న నాయి బ్రాహ్మణుల, రజకుల కుటుంబాలకు భరోసా కల్పించే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రమాద భీమా పథకం అమలయ్యేలా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గడ్డం నరేష్, గడ్డం శేఖర్, సతీష్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.