భువనగిరి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం..

భువనగిరి ( జనం సాక్షి )
. ఈరోజు భువనగిరి పట్టణ స్థానిక రహదారుల బంగ్లాలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి నియోజకవర్గ నాయకులు పంజాల రామాంజనేయ గౌడ్ మరియు పిసిసి కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి గోద శ్రీనివాస్ గౌడ్ వడపర్తి సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి, చిక్కుల వెంకటేశం పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల ను వ్యతిరేకిస్తూ ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం నిరంతరంగా కృషి చేయాలని అన్నారు, కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ మహిళా డిక్లేషన్ ప్రకటించి ధరణి పోర్టల్ రద్దు రెండు లక్షల రూపాయలు ఒకేసారి రుణమాఫీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లను మన కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ప్రకటించారు దీనిని ప్రతి గ్రామంలో గడపగడపకు తీసుకువెళ్లి అన్నారు, కార్యక్రమంలో సర్పంచ్ నానం పద్మ కృష్ణ గౌడ్,చిన్నం శ్రీనివాస్, జక్కుల స్వామి,నానం కృష్ణ నుంచు నాగయ్య సిరికొండ శివకుమార్ గుమ్మడల్ రమేష్, మచ్చ నరసింహ మంగ ప్రవీణ్, చుక్క స్వామి, ఎడ్ల శ్రీనివాస్, కోట మహేందర్ , బబ్బురి,నరసింహ పుట్ట కృష్ణ, పులిగిల్ల బాలయ్య,! ఏడు మేకల మహేష్, ఉడుత కార్తీక్ , చిన్నం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు