సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్ఎం ని సికింద్రాబాద్ లో కలిసిన
భారస జిల్లా అధ్యక్షులు,మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవితమ్మ
డోర్నకల్/ జులై 31, జనం సాక్షి న్యూస్:
డోర్నకల్ పట్టణంలోని సుభాష్ స్ట్రీట్ వీధి నుండి బిషప్ హాజరయ్య ఫంక్షన్ హాల్ వరకు గోడ నిర్మాణం పనులో భాగంగా స్థానికులు పడుతున్న ఇబ్బందులను రైల్వే డిఆర్ఎం కు వివరించిన యంపి మాలోత్ కవిత.సమస్యపై సికింద్రాబాద్ రైల్వే డిఆర్ఎం వెంటనే స్పందిస్తూ బడి పిల్లలకు, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు, నిత్యవసర అవసరాలకు ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడమని సంబంధిత అధికారులకు ఆదేశాలు.యంపి కవిత వెంట డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న , నాయిని వెంకటేశ్వర్లు, జిల్లా విలియం జాన్సన్ , పోకల రమేష్ కన్నా, కోదమల్ల చక్రవర్తి, మాతంగి అనిల్ కుమార్, బి శంకర్ లు ఉన్నారు.




