హైదరాబాద్,జూన్ 13(జనంసాక్షి): మియాపూర్ భూకుంభకోణంపై విచారణ జరిగేలా ఆదేశించాలన ఇగవర్నర్ నరసింహన్‌ను టిడిపి కోరింది. ఈ భూముల కుంభకోణంపై తెలుగుదేశం పార్టీ తన పోరాటాన్ని ఇప్పటికే ఉద్ధృతం చేస్తోంది. పార్టీ నేతలు రేవంత్‌రెడ్డి, ఎల్.రమణతో కూడిన పార్టీ బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. మియాపూర్ భూకుంభకోణంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. భూకుంభకోణానికి వ్యతిరేకంగా తెదేపా నిన్న అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల వద్ద ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. వేలకోట్ల రూపాయల భూకుంభకోణంలో ఎవరున్నా చర్యలు తీసుకోవాలన్నారు. గవర్నర్ తమ వినతిని విన్నారని చర్యలు తీసుకోవాలని కోరగా సానుకూలంగా స్పందించారని టిడిపి నేతలు అన్నారు. భూకుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని టి.టీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి గవర్నర్‌ను కలిసిన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతయ్యాయని ఆరోపించారు. ఎన్నికల్లో మద్దతిచ్చినవారికి కేసీఆర్ భూములు కట్టబెడుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ అండదండలతో గోల్డ్‌స్టోన్ ప్రసాద్ భూములు కొల్లగొట్టారని తెలిపారు. కేసీఆర్ నుంచి ప్రభుత్వ భూములను కాపాడుకుంటామని అన్నారు. టిఆర్‌ఎస్ నేతలే ఇందులో ప్రధాన భగస్వాములన్నారు. అందుకే సిబిఐ విచారణ సాగితే నిజాలు వెల్లడవుతాయన్నారు.




