భూపాలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడిగా నంగావత్ భాస్కర్

భూపాలపల్లి టౌన్ ఆగస్టు 31 (జనం సాక్షి)
  ఏఐసీసీ జాతీయ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా అధ్యక్షులు అయితే ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు పోరిక సమ్మయ్య నాయక్ ఆధ్వ ర్యంలో భూపాలపల్లి మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు గా నంగావత్ భాస్కర్ నాయక్ ను నియమించి  నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా భాస్కర్ నాయక్ మాట్లాడుతు ఈ ఎన్నికకు సహకరించిన జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు పోరిక సమ్మయ్య ,మాజీ మంత్రి వర్యులు ఏఐసీసీ కార్యదర్శి మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు అయితే ప్రకాశ్ రెడ్డి, భూపాలపల్లి నియోజికవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారయణ రావు , పట్టణ అధ్యక్షులు దేవన్ , మండల అధ్యక్షులు రామచంద్రయ్య , ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ లకు కృతజ్ఞతలు తెలిపారు పార్టీని బలోపేతం చేయడంలో నా వంతు కృషి చేస్తానని అన్నారు.