Tuesday, 3 November 2026

భూముల కబ్జాలకు ప్రయత్నించినందుకు బేషరుతుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డిపదవికి రాజీనామా చెయ్యాలి

 :సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి
 ఎల్బీనగర్( జనం సాక్షి )     భూముల  కబ్జాలకు ప్రయత్నించినందుకు బేషరుతుగా మంత్రి    సబితా ఇంద్రారెడ్డిప తన   దవికి రాజీనామా చెయ్యాలని  కాంగ్రెస్ పార్టీ   సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు  మహేశ్వరం నియోజకవర్గం* మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఒక బాధ్యతయుత మంత్రి పదవిలో ఉండి చెరువుల్లో అక్రమ కట్టడాలను తొలగించాల్సింది పోయి, అక్రమ దారులను ప్రోత్సహించడం ఎంత వరకు సబబు అని అన్నారు. ఇక్కడున్న  డిసిఎమ్ వాహనదారుల అడ్డా లో అక్రమ కట్టడాలు కడితే ఇక్కడున్న 55   డిసి ఎమ్ లు నడుపుకునే కుటుంబాలను రోడ్డు మీద పడేసి వారవుతరని అని అన్నారు. చెరువులో వాణిజ్య సముదాయానికి శిలాఫలకం వేసి భూకబ్జా దారులను ప్రోత్సహిస్తున్నారుఅని అన్నారు. మీరు, మీ అనుచరుల భూకబ్జాలు అక్రమనలపై మీ సొంతపార్టీ నేతలే నిరసన కార్యక్రమాలు చేపడతున్నారు, అంటే మీరు ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నరో అర్థం ఔతుంది అని అన్నారు. విద్యార్థుల కోసం తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలో అభివృద్ధి కనీస వసుతుల కల్పనకు ఏ నాడూ కృషిచెయ్యని మీరు విద్యశాఖలోని పాఠశాలల భూములు కబ్జాలు చేస్తారా..?,  పాఠశాల భూమి కబ్జాకు ప్రయత్నించినందుకు బేషరుతుగా మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలి అని డిమాండ్ చేశారు..ఈ సందర్భంగా సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భూ కబ్జాలను  ప్రోత్సహిస్తున్నారు, చెరువులను పాఠశాలను కూడా వదలట్లేదు అని అన్నారు. తన సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యే మీ అవినీతి మీద ఆరోపణలు చేస్తున్నారంటే ఎంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారో ప్రజలు గమనించాలనీ అన్నారు.  చెరువు అభివృద్ధి కొరకు గతంలో హరీష్ రావు గారి చనువుతో కోట్ల రూపాయలను తీసుకొచ్చారు, అభివృద్ధి మాత్రం ఎక్కడ జరగలేదని అన్నారు, పార్టీ మారి మంత్రి పదవి తీసుకున్నది తన ఆస్తులు మరింత పెంచుకోవడానిి తప్ప …నియోజకవర్గనికి ఎలాంటి అభివృద్ధి చెయ్యలేదని అవినీతి మంత్రికి రానున్న రోజుల్లో  ప్రజలు తగిన బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారు అని అన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ *బండి మధుసూదన్ రావు , స్వామి నాయక్, సిద్దేశ్వర చారి, వీరన్న, పన్నాల సురేష్, నారగోని సతీష్ , బొడ్డుపల్లి మహేందర్, కళ్యాణ్, శ్రవణ్, శ్రీధర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.