భూవివాదం కారణంగా మనస్థాపనికి గురై వ్యక్తి మృతి

పెద్దవంగర ఆగష్టు 07(జనం సాక్షి ) పెద్దవంగర మండలం వడ్డేకొత్తపల్లి గ్రామంలో దళితుడు జాజుల సంజీవ తన భూవివాదం కారణంగా మనస్థాపానికి గురై మృతి చెందాడు.వడ్డేకొత్తపల్లి గ్రామానికి చెందిన జాజుల సంజీవ కు అతడి పక్క పొలం వ్యక్తి జినుకాల మల్లేష్ కు గత కొంత కాలంగా భూవివాదం నడుస్తుంది.ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరుచు గొడవలు జరుగుతున్నాయి.గ్రామంలోని పెద్దమనుషులు తీర్మానం చేసిన వినకుండా జినుకాల మల్లేష్ జాజుల సంజీవ భూమిని ఆక్రమణలో ఉంచుకొని పొలం నాటు వేసుకున్నాడు.ఆదివారం రోజున గొడవ కాస్త పెద్దది కావడంతో తన భూమి తనకు కాకుండా పోతుందని మనస్థాపనికి గురైనాడు.సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేద్దాం అనుకునే లోపు మనస్థాపంతో మృతి చెందాడు. మృతునికి ఇద్దరు భార్యలు,పెళ్ళికి ఎదిగిన ముగ్గురు కూతురులు, ఒక అబ్బాయి ఉన్నారు.మృతుని బంధువులు గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజావార్తలు