Monday, 2 November 2026

భూ కబ్జాలు ఆపాలి:

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలమల్లేశ్: శామీర్ పేట్, జనం సాక్షి :
కుత్బుల్లాపూర్ మండలంలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్న వాటిని అరికట్టడంలో రెవెన్యూ అధికారులు విపలమవుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలమల్లేశ్ విమర్శించారు.
శుక్రవారం ప్రభుత్వ భూములు పరిరక్షించాలని,పేదలకు డబల్ బెడ్రూమ్ లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ఆదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి కి వినతిపత్రం అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అనేకం అవుతు న్నాయన్నారు. అట్టి భూముల్లో ప్రభుత్వం డబల్ బెడ్రూం నిర్మించి ఇస్తే పేద ప్రజల సమస్య తీరుతుందని అన్నారు. ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వ భూములను కబ్జాదారులు కబ్జాచేసి వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకొని ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు.తక్షణమే గాజులరామరం లోని సర్వే నెంబర్ లో 329,307,342 ప్రభుత్వ భూములను రక్షించాలని డిమాండ్ చేసారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి డి జి సాయిలు గౌడ్, జిల్లా సహాయ కార్యదర్శి ఉమా మహేశ్ ప్రసంగిస్తూ గాజులరామరం సర్వే నెంబర్ 342,329,307 లో జరుగుతున్న బుకబ్జాల పై అధికారులు కబ్జాదారుల వైపా లేక పేద ప్రజల వైపా చెప్పాలని ప్రశ్నించారు ఇలాగే కబ్జాలు కొనసాగిస్తే మాత్రం సీపీఐ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్,జిల్లా కౌన్సిల్ సభ్యులు నర్సింహ,వెంకట చారీ,సహదేవ్, మండల నాయకులు సాయిలు, చంద్రయ్య,ఇమామ్, ఏఐవైఫ్ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, శ్రవణ్, ఉపేందర్ లు పాల్గొన్నారు.
30ఎస్పీటీ -2: వినతి పత్రం అందజేస్తున్న నాయకులు