భైంసాలో ఐ వోట్ ఫర్ షూర్ నినాదంతో 5కె రన్

ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్

భైంసా రూరల్ జనం సాక్షి ఆగస్టు22నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో నీస్థానిక శివాజీ చౌక్ నుండి ప్రారంభమై ప్రధాన వీధుల గుండా సాగిన 5కె రన్ ప్రారంభించారు
బస్ స్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడి ఓటరు ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవచ్చు అని పిలుపునిచ్చారు సెప్టెంబర్ 19 వరకు కొత్త ఓటర్ల నమోదు మార్పులు చేర్పుల కోసం ఎన్నికల సంఘం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి మరియు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు