Thursday, 5 November 2026

రెండవ ఏఎన్ఎంల ఆందోళన ఉదృతం

-మోకాళ్లపై రెండవ ఏఎన్ఎంల నిరసన

సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 23. (జనంసాక్షి). ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సమస్యలు పరిష్కరించారని కోరుతూ రెండవ ఏఎన్ఎంలు చేస్తున్న నిరసన ఉధృతంగా మారుతుంది. రిలే దీక్షలు బుధవారం 8వ రోజుకు చేరుకున్నాయి. సమస్యలు పరిష్కరించకుండా అలసత్వం వహిస్తున్న ప్రభుత్వం తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెండవ ఏఎన్ఎంలు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న తమ డిమాండ్ ను పరిష్కరించాలని కోరారు. నిరసన కార్యక్రమాలు పలువురు జిల్లాలోని రెండవ ఏఎన్ఎంలు పాల్గొన్నారు.