భైంసా లో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు అభిమానులు నిరసన జ్వాలలు
– భైంసా రూరల్ జనం సాక్షి ఆగస్టు24
మంత్రి తలసాని శ్రీనివాస్ భైంసా ఏ.ఎం.సి చైర్మన్ రాజేష్ బాబుకి రానున్న48 గంటలలో బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే అన్ని సామూహిక వర్గాలతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని గిరిజనులు,రాజేష్ బాబు అభిమానులు,పలువురు గురువారం బైంసా బస్టాండ్ ఎదుట రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ… మంత్రి తలసాని శ్రీనివాస్ తలపోగురుతో రాజేష్ బాబు పై అనుచితంగా ప్రవర్తించడం,చేజేసుకోవడం తప్పని వెంటనే ఇలాంటి వాటిపై స్పందించి క్షమాపణ చెప్పలన్నారు. లేకపోతే రాష్ట్రం మొత్తంలో ఉన్న గిరిజనులందరూ ఏకమై మా పవర్ ఏంటో చూపిస్తామంటూ అన్నారు.