Friday, 6 November 2026

మంత్రుల నివాస సముదాయాల ముట్టడి

హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ బంజారాహిల్స్‌లోని  మంత్రుల నివాస సముదాయాలను విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు విద్యార్థి సంఘాలను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు కొందరు విద్యార్థి సంఘ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *