మంథనిలో ఘనంగా సీఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు

 జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ మంథని మండల శాఖ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను శుక్రవారం నిర్వహించారు . ఇందులో భాగంగా మంథని మునిసిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ కేట్ కట్ చేసి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలనీ కోరుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మండల పార్టీ అధ్యక్షుడు ఏగోళపు శంకర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎంపీపీ కొండ శంకర్‌, జెడ్పీటీసీ తగరం సుమలత శంకర్‌లాల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్మన్‌ ఎక్కటి అనంతరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, రైతు బంధు మండల అధ్యక్షుడు ఆకుల కిరణ్‌, మండల పార్టీ ఉపాధ్యక్షుడు అక్కపాక సంపత్‌, మండల యూత్‌ అధ్యక్షుడు కొండ రవీందర్‌, వార్డు కౌన్సిలర్‌లు కొట్టే పద్మ రమేష్‌,వీకే రవి, వేముల లక్ష్మిసమ్మయ్య, గుండా విజయలక్ష్మిపాపారావు, గర్రెపల్లి సత్యం, కాయితి సమ్మయ్య, నక్క నాగేంద్ర శంకర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు బత్తుల సత్యనారాయణ, మాజీ వైస్‌ ఎంపీపీ వేల్పుల గట్టయ్యతో పాటు పార్టీశ్రేణులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.