Wednesday, 4 November 2026

మందమర్రి శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా 76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

౼విద్యార్థినీ,విద్యార్థులు చేసిన దేశభక్తి ,జానపద పాటలనృత్యాలు,వేషధారణ ఆకట్టుకున్నాయి.*
మందమర్రి పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో సోమవారం
76వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రిన్సిపాల్ ఎ. నవీన్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా జరుపుకుంటున్న విద్యార్ధిని, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి భారతీయుని హృదయం ఉప్పొంగిపోయే విశిష్ట సందర్భమిదని. బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించి, భారతదేశ స్వేచ్ఛకూ, సార్వభౌమాధికారానికీ ప్రతీకగా త్రివర్ణపతాకం ఆవిష్కృతమై నేటితో 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయని పేర్కొన్నారు.
స్వాతంత్ర్యం నా జన్మహక్కని చాటిన లోకమాన్య బాలగంగాధర తిలక్, శాంతి, అహింసలతో స్వాతంత్ర్య పోరాటాన్ని శిఖరాగ్రానికి చేర్చిన మహాత్మాగాంధీ, ఆజాద్ హింద్ ఫౌజ్ ను నడిపి సమరసేనానిగా నిలిచిన సుభాష్ చంద్రబోస్, చిరునవ్వుతో ఉరికంబమెక్కిన ధీరోదాత్తుడు భగత్ సింగ్ వంటి ఎందరో మహనీయుల త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. స్వాతంత్ర్య పోరాటంలోనూ, నవభారత నిర్మాణంలోనూ మహోన్నతమైన పాత్ర పోషించిన తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్, మహోన్నత తాత్వికుడు, సంస్కర్త, భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహానుభావుల సేవలు చిరస్మరణీయాలు ఉన్నాయని విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం డైరెక్టర్ శ్రీవిద్య, చైర్మన్ మల్లంపల్లి శ్రీధర్, డిజియం జి.లక్ష్మణ్ రావు, ఆర్.ఐ. ఎం.రాజు, ఎజడ్ఎసి కోటేశ్ రావు, ప్రిన్సిపాల్ ఎ. నవీన్ కుమార్, డీన్ నాగేశ్వరరావు,
ప్రైమరీ ఇంచార్జి సునీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.