మజీద్ కమిటీ ఆధ్వర్యంలో షర్బత్ పంపిణీ
జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం జామా మజీద్ కమిటీ ఆధ్వర్యంలో మొహరం సందర్భంగా షర్బత్ శుక్రవారం పంపిణీ చేశారు. మొహరం నెలను పురస్కరించుకొని పాలతో చేసిన షర్బత్ ను హసేన్ హుస్సేన్ ల స్మారకార్థం పంపిణీ చేశారు. మొహరం నెల విశిష్టత గురించి మత గురువు రహమత్ వివరించారు. కాగా ఈనెల విషాద నెల అని హసేన్ హుస్సేన్ లు శత్రువుల చేతిలో అమరుల య్యారని పేర్కొన్నారు. ముస్లింలు 10 రోజులపాటు సంతాప దినాలుగా పాటిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జబ్బర్ ఖాన్, మహబూబ్ అలీ షేక్, మహబూబ్ మతిన్ ఖాన్, ఇజాద్ ఖాన్, ఫరీద్, ఇమామ్ ఖాన్, ఇనాయత్, షేక్ షాకీర్, షేక్ అలీమ్, జావిద్ ఖాన్, అల్ఫాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.