Tuesday, 3 November 2026

మజ్లిస్‌ పార్టీ వ్వవహారంలో కాంగ్రెస్‌ పార్టీది అవకాశవాదం: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ

హైదరాబాద్‌: నవంబర్‌ 15;(జనంసాక్షి):మజ్లిస్‌ పార్టీ వ్వవహారంలో కాంగ్రెస్‌ పార్టీది అవకాశవాదమని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఆర్టీసి మాజీ చైర్మన్‌ గోనే ప్రకాశ్‌రావు గురువారం అన్నారు ఆయన హైదరాబాద్‌ విలేకరులతో మాట్లాడారు దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ సహా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం అనేకసార్లు మజ్లిస్‌ పార్టీ మద్దతు కోరిందని గుర్తు చేశారు హైదరాబాదులో చాలాచోట్ల మైనార్టీ ఓట్టతోనే కాంగ్రెస్‌ పార్టీ గడిచిన సాధారణ ఎన్నికల్లో గెలుపొందిందన్నారు అదే సమయంలో కాంగ్రెస్‌ మద్దతు లేకుండానే మజ్లిస్‌ విజయం సాధించిందన్నారు అటువంటింది ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ మజ్లిస్‌ పార్టీని విమర్శించడం సరికాదన్నారు మరోవైపు మజ్లిస్‌ పార్టీపైన భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు మజ్లిస్‌ పార్టీ రాష్ట్ర అజెండాలో పని చేస్తాందని విమర్శించారు పాతబస్తీలో చేసిన గూండాయిజాన్ని మజ్లిస్‌ రాష్ట్రవ్యాప్తంగా విస్తరింప చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు రాష్ట్రంలో ఇతర ముస్లింలను ఎదగకుండా మజ్లిస్‌ కుట్ర చేస్తోందన్నారు ఆపార్టీ దౌర్జన్యాలను బిజెపియే నిలధీస్తోందన్నారు భాగ్యలక్ష్మి ఆలయం విషయంలో రాజకీయ పక్షాలు ఎందుకు స్పందించడం లేదని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు మజ్లిస్‌ మద్దతు ఉపసంహరించుకున్నా నగర మేయర్‌ తన పదవికి ఎందుకు రాజీనామా చేయడం లేదోచెప్పాలన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *