మతోన్మాద శక్తుల నుండి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడమే వెంకటరాం కిచ్చే నివాళి
– సిపిఐ నేతలు హుజూర్ నగర్, సెప్టెంబర్ 11(జనం సాక్షి): దివంగత మాజీ సిపిఐ నాయకుడు ఇందిరాల వెంకటరామ్ కు హుజూర్ నగర్ లో సిపిఐ బృందం ఘనంగా నివాళులర్పించింది. ఆదివారం ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్ మాట్లాడుతూ మతోన్మాద శక్తుల నుండి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడమే వెంకటరాం కిచ్చే నివాళి అని అన్నారు. చిన్న వయస్సు నుంచే కుటుంబ నేపథ్యం పరంగా సిపిఐ పార్టీ ప్రజా సంఘాలలో చురుకైనపాత్ర పోషిస్తూ విద్యార్థి యువజన రంగాలతో పాటు వ్యవసాయ కార్మిక సంఘంలో ఆయా వర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల నిత్యం ముందుండి పోరాడేవాడని ఆయన గుర్తు చేసుకున్నారు. వెంకట్ రామ్అనారోగ్యంతో భౌతికంగా దూరమయ్యి సంవత్సరకాలం గడిచిపోయింది అని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, మతోన్మాద విధానాలపై, రైతాంగ వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేయాలని, దేశంలో లౌకిక శక్తులను బలోపేతం చేయడమే సిపిఐ విధానమని, అందులో భాగంగానే మునుగోడులో టిఆర్ఎస్ కు మద్దతిస్తున్నామని భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని నిలువరించడంకోసం సిపిఎం టిఆర్ఎస్ తో కలిసి ప్రయాణం చేయనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాస్, పాలకూరి బాబు, ధూళిపాళ ధనుంజయ నాయుడు, రైతు సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు కొప్పోజు సూర్యనారాయణ, ఇందిరాల వెంకటేశ్వర్లు , ఏ ఐ వై ఫ్ జిల్లా అధ్యక్షులు చిలకరాజు శ్రీను తదితరులు పాల్గొన్నారు.