Wednesday, 4 November 2026

మత్స్యకారులకు అండగా సిఎం కెసిఆర్‌

సంగారెడ్డి,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ఆశించిన విధంగా చెరువులు, కుంటలు నిండినట్లయితే గంగపుత్రులు,మత్స్యకారుల ఉపాధికి ఢోకా ఉండదని గంగపుత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లయ్య అన్నారు. గంగపుత్రుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని  అన్నారు. మత్స్యకారుల జీవనోపాధికై ఆటోలు,టీవీఎస్‌ మోపైడ్‌ వాహనాలను సబ్సిడీపై పంపిణీ చేస్తూ అండగా నిలుస్తున్నారని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మత్స్యకారులంతా సీఎం కేసీఆర్‌వైపే నిలబడి కారుగుర్తుకే ఓట్లేసి గెలిపించారన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. త్వరలో జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ గంగపుత్రులు, మత్స్యకారులంతా కారుగుర్తుకు ఓట్లేసి ఎంపీలను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. చేప పిల్లలను సబ్సిడీపై అందిస్తూ వారి ఉపాధికి ఆయన చొరవ చూపిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 46వేల చెరువులను ఇప్పటికే ఆధునీకరించడం జరిగిందన్నారు. కాళేశ్వరం, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయినట్లయితే మత్య్సకార కులస్తులతో పాటు వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.