మత్స్య కార్మికులు అన్ని విధాలుగా ఎదగాలి

ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం

సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , జూలై 29 ::సంగారెడ్డి మండల పరిధిలోని ఫసల్వాది గ్రామంలోని నూతనంగా ఏర్పడిన మచ్చ శాఖ పారిశ్రామిక సంఘం సభ్యులు శనివారం  సమావేశమయ్యారు.ఈ కార్యక్రమానికి పట్నం మాణిక్యం డిసిసిబి వైస్ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లా హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పట్నం మాణిక్యం మాట్లాడుతూ మత్స్య కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని, వారికి చేప పిల్లల అందజేయడంతో పాటు, వాహనాలు కూడా ప్రభుత్వం ఉచితంగా అందజేయడం వివరించారు. రానున్న రోజుల్లో  కార్మికులు మచ్చ కార్మికులు అన్ని విధాలుగా ఎదగడం జరుగుతుందన్నారు.అనంతరం పట్నం మాణిక్యం సంఘ సభ్యులు సన్మానించారుఈ కార్యక్రమంలో పట్నం మాణిక్యం డిసిసిబి వైస్ చైర్మన్ గ పాటు గ్రామ మచ్చ శాఖ సంఘం సభ్యులు తదితరులు  పాల్గొన్నారు.

తాజావార్తలు