ఆర్థిక సాయం జేసిన మంచుకొండ కృప యువజన సంఘం సభ్యులు.

రఘునాథపాలెం జులై 29 (జనం సాక్షి) మండలంలోని చిమ్మపూడి గ్రామానికి చెందిన బాలిక కాంపాటి జ్యోష్ణవి ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది . నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె వైద్య ఖర్చులకు కుటుంబీకులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారన తెలుసుకున్న మంచుకొండ కృప యువజన సంఘం వ్యవస్థాపకులు మంద సంజీవరావు ఆధ్వర్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి , 5000 వేలు రూపాయలు ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి ఈ సొసైటీ ద్వారా నిరుపేద పిల్లలకు మరియు అనారోగ్యాలతో బాధపడుతున్న వారి పరిస్థితులను గుర్తించి వందల మందికి ఆర్థిక సహాయం అందిస్తూ సొసైటీని ముందుకు తీసుకు వెళ్తున్నామని అన్నారు సొసైటీ కమిటీ సభ్యులందర ప్రోత్సహంతో ఇలాంటి మంచి కార్యక్రమలు చేపడుతున్నామని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం ట్రస్ట్ వ్యవస్థాపకులు జావీద్ కెసిఆర్ నగర్ టిఆర్ఎస్ నాయకులు కంచర్ల మోహన్ శివ , ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన అమౌంట్ టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మారపాక పృథ్వి వడకాల ప్రవీణ్ రాజేష్ కాంగ్రెస్ పార్టీ చెందిన చిమ్మపూడి గ్రామ శాఖ తోటపల్లి మురళీకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు .

తాజావార్తలు