Saturday, 7 November 2026

మద్యం ఏరులై పారించి ఆడబిడ్డల ఉసురు తీసుకుంటున్నా సిఎం కెసిఆర్ :

 హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
ఎల్బీ నగర్( జనం సాక్షి  )  సీఎం కేసీఆర్ పల్లెల్లో మద్యం ఏరులై పారించి ఆడబిడ్డల ఉసురు తీసుకుంటున్నాడని మాజీమంత్రి, హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్  ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం  ఉదయం నుంచి రాత్రి వరకు మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలంలో విస్తృతంగా ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా మండల సహా ఇన్ఛార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్.. ఈటెల రాజేందర్ కి ఘన స్వాగతం పలికారు.
ఈ ప్రచారంలో టీఆర్ఎస్ నేతలు సహా సీఎం కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. హూజూరాబాద్ ఉపఎన్నిక మునుగోడు నియోజకవర్గంలో రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు ఈటెల రాజేందర్
యువతను మద్యానికి బానిసలుగా చేసి వారి భవిష్యత్ తో ఆటలు ఆడుతున్న దుర్మార్గమైన వ్యక్తి  సిఎం కెసిఆర్  అని మండిపడ్డారు.