మధ్యాహ్న భోజన కార్మికుల ఎంపీడీవో రమాదేవికి వినతి పత్రం అందించారు
ముస్తాబాద్ ఆగస్టు 29 జనం సాక్షి
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 3 వేల రూపాయలు ఇస్తా అని మాట తప్పి 8 ఎండ్లు గడిచిన ఇప్పటికి ఉలుకు పలుకు లేదు. ఒక పక్క పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ప్రభుత్వము ఇచ్చే 7 రూపాయలతో ఏమీ చేసి పెట్టమంటారు? వంట? అప్పు తెచ్చి మరీ కాలం గడుస్తున్న కనికరం, లేదు మా పైన మార్చ్ నుండి పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంది. కనీస వంట పాత్రలు కూడా లేవు గుడ్డు ప్రభుత్వమే ఇప్పించాలి లేదా 7 లో 5 రూపాయలు గుడ్లకే పోతే ఎమ్ మిగులుతుంది అంటూ ముస్తాబాద్ ఎంపీడీవో కార్యాలయం మెట్లు ఎక్కరు న్యాయం జరగకపోతే మధ్యాహ్న భోజనం నిలిపివేస్తామని తెలియజేశారు. వీరికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ మండల ప్రధానకార్యదర్శి సౌల్ల క్రాంతి కుమార్ మద్దతు నిలిచారు.ఈ కార్యక్రమం లో మధ్యాహ్న భోజన కార్మికుల మండల అధ్యక్షురాలు గొట్టే సంతోషా, బర్ల మైసవ్వ, బండి సావిత్రి, బండ రాజవ్వ, పర్శా దేవలక్ష్మి, సుమతి, మనేవ్వ లక్ష్మి 75 మంది మండల కార్మికులు పాల్గొన్నారు.