హైదరాబాద్,మార్చి8(జనంసాక్షి):విద్యార్థులకు ఎంతో కీలకమైన పరీక్షల కాలం ఇది. ఇన్నాళ్లుగా చదివి నేర్చుకున్న పాఠాలు, విషయాల్ని పేపరు విూద పెడితేనే మంచి మార్కులు కొట్టేయొచ్చు. ఎంత కాదనుకున్నా కాస్త ఒత్తిడి ఉంటుంది. అంతా చదివినా ఎక్కడో ఏదో మరచిపోయామనిపస్తుంది.పరీక్ష హాలుకు వెళ్తున్నప్పుడు ఫలానా పేరు అదేనా, టెక్ట్స్ బుక్‌లో ఏముంది? అనే అనుమానమూ వస్తుంది. ఫలానా ఫార్ములా కరెక్టా కాదా అనే ఆలోచనా వస్తుంది. పరీక్ష ఎలా రాస్తానో అనే ఆందోళనా కలుగుతుంది. ఇలాంటి అన్ని ఇబ్బందుల నుంచి తప్పించడానికి కొన్ని యాప్స్, యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి. పదో తరగతి విద్యార్థులకు ఉపయోగపడేలా వీటిని రూపొందించారు. అంతా సిద్ధం… కానీ ఒక చిన్న డౌట్ ఉంది. కానీ ఎలా… టెక్ట్స్ బుక్ ఇంట్లో మరచిపోయానని చివర్లో అనిపిస్తుంది. చాలామందికి ఇలాంటి పరిస్థితి వస్తుంటుంది. అలాంటప్పుడు విూ చేతిలో మొబైల్ ఉంటే టెక్ట్స్ బుక్ ఉన్నట్లే. ు|శ్రీaఅస్త్రaఅa ూఈఊ=ు ఇశీశీస యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే సరి. అందులో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ భాషల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు పుస్తకాల పీడీఎఫ్‌లు అందుబాటులో ఉంటాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకొని అవసరమైన సమాచారం పొందొచ్చు.




