మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య.
దౌల్తాబాద్ ఆగష్టు 11, జనం సాక్షి.
అప్పులు తీర్చలేక యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల పరిధిలో ఇందుప్రియల్ గ్రామానికి చెందిన తోట కుమార్ (36) దాబా నడుపుతున్నాడు.అతడు అప్పులు బాగా చేశాడు.అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్థాపంతో దాబా దగ్గర పురుగుల మందు తాగి అక్కడే పడుకున్నాడు. తెల్లవారుజామున గ్రామానికి చెందిన అతని స్నేహితుడు దాబా దగ్గరకు వెళ్లి లేపగా అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు